బాలలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ ఏడో విడత కార్యక్రమం సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో బాలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనాథ పిల్లలను, తప్పిపోయిన వారిని గుర్తించి ప్రభుత్వ వసతి గృహాల్లో అప్పగించడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని తెలిపారు.
ముఖ్యంగా బస్టాండ్, రైల్వేస్టేషన్, పరిశ్రమలు, మార్కెట్, ముఖ్య కూడళ్లలో తనిఖీలు నిర్వహించి బాలలను గుర్తించాలని పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించాలని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ, ఐసీపీఎస్, పోలీసు శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
ఇదీ చదవండి: భక్తులకు శుభవార్త- 'శబరిమల రైలు'కు ఓకే