నిర్మల్ జిల్లా కుంటాల మండల ఓలా గ్రామంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 74 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ కోసం దశల వారీగా గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఇవీచూడండి: సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు