నిర్మల్ జిల్లా భైంసా పురపాలక సంఘంలో మున్సిపల్ బడ్జెట్‌పై సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2020-21 ఆర్థిక బడ్జెట్‌పై పలు అంశాలను చర్చించారు. కౌన్సిలర్లు వార్డుల్లో కావాల్సిన పనుల గురించి అధికారులకు తెలిపారు.
మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం, సిబ్బందికి చెల్లించే వేతనాలు, హరితహారం, పలు విషయాలకు సంబంధించిన పనులను అధికారులు వెల్లడించారు. భాజపాకు చెందిన కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
ఇదీ చూడండి : భోజన పథకం బిల్లులేవీ ?? వంట ఎలా చేయాలి ?