ETV Bharat / state

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి.. 0.6 టీఎంసీల నీరు విడుదల

ప్రతి సంవత్సరంలాగే... ఈ ఏడు కూడా మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 0.6 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.

author img

By

Published : Mar 1, 2020, 5:01 PM IST

bobbly project gates opened
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి.. 0.6 టీఎంసీల నీరు విడుదల

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడం వల్ల నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మార్చి 1న బాబ్లీ గేట్లను ఎత్తి 0.6 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తారు. అదేవిధంగా జులై 1న గేట్లను ఎత్తి అక్టోబర్ 28న బాబ్లీ గేట్లను మూసివేస్తారు.

ఈ రోజు మార్చి ఒకటో తేదీ కావడం వల్ల ప్రతి సంవత్సరంలాగే... ఈ రోజు గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో 1.31 టీఎంసీలు నీరు ఉండగా... 0. 6 టీఎంసీల నీళ్లు దిగువకు వదులుతున్నారు. నీటి విడుదల పూర్తయ్యాక బాబ్లీ ప్రాజెక్టులో 0.71 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.