తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే సీఎం అవుతారని చెప్పి.. కేసీఆర్ ఎస్సీలను మోసం చేశారంటూ నిర్మల్ జిల్లాలోని భాజపా నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా దళిత మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
సీఎం కేసీఆర్‌కు దళితులంటే గౌరవం లేదని నేతలు ఆరోపించారు. మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. జిల్లాలో దళితులకు కేటాయించిన భూమిలో.. పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పై 125అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ఏమైందంటూ నేతలు ప్రశ్నించారు. దళితులను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదంటూనే.. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సాగర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'గెలవకముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?'