భైంసాలో హిందు వాహిణి కార్యకర్త ఇంటిపైన దాడిచేసి తగల బెట్టడాన్ని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడి... పదిహేను ఇళ్లను దగ్ధం చేసింది ఎంఐఎం బ్రోకర్లని ఆరోపించారు. ఎంఐఎం కార్యకర్తలు హిందువులను లక్ష్యంగా చేసుకుని భైంసాలో రాళ్ల దాడి చేశారన్నారు. పోలీసులు దాడికి పాల్పడిన ముస్లింలపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరో అర్థం కావడంలేదన్నారు. పోలీస్ వ్యవస్థ ఒక్కవర్గానికే పనిచేస్తుందా అని ప్రశ్నించారు. హిందువులను కాపాడే బాధ్యత పోలీసులకు ఉందా లేదా అని ప్రశ్నించారు.
భైంసాలో హిందువులపైన దాడులు ఆగాలని ముఖ్యమంత్రి, హోంమంత్రికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా దాడికి పాల్పడితే ఆత్మరక్షణ కోసం ఏమి చేస్తారో చేయండి మేము అండగా ఉంటామని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి:రాళ్ల దాడి, ఇళ్లకు నిప్పు.. డీఎస్పీతోపాటు పలువురికి గాయాలు