2018లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం లోపలికి దూసుకెళ్లి అక్కడే బైఠాయించారు. నిరుద్యోగ భృతి, పీఆర్సీపై ప్లకార్డులను ప్రదర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే 47.5శాతం పీఆర్సీని అమలుచేయాలని, నిరుద్యోగ యువతకు భృతి చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాల్సింది పోయి.. ఉన్న వేతనం తగ్గించడమేంటని ప్రశ్నించారు. 2018లో ప్రకటించిన పీఆర్సీని ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. హెచ్ఆర్ఏను తగ్గించడం సరికాదని, ఉద్యోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని అన్నారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడు: కొప్పుల