నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన శిరీష ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. తక్కువ బరువుతో ఉండటం వల్ల చిన్నారులను ఇంక్యూబేటర్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. శిరీషకు ఇదే మొదటి కాన్పు కాగా... శస్త్ర చికిత్స ద్వారా ప్రసవించినట్లు వైద్యులు పేర్కొన్నారు. తల్లిబిడ్డులు క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం... తల్లీబిడ్డలు క్షేమం - three babies born in one birth at bellal
ఒకే కాన్పులో ఏకంగా ముగ్గురు శిశువులు జన్మించిన అరుదైన ఘటన నిర్మల్లో జరిగింది. ఈ కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించగా... తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
![ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం... తల్లీబిడ్డలు క్షేమం Birth of three babies in a single birth... Mother and babies doing well](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11336080-661-11336080-1617941735129.jpg?imwidth=3840)
Birth of three babies in a single birth... Mother and babies doing well
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన శిరీష ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. తక్కువ బరువుతో ఉండటం వల్ల చిన్నారులను ఇంక్యూబేటర్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. శిరీషకు ఇదే మొదటి కాన్పు కాగా... శస్త్ర చికిత్స ద్వారా ప్రసవించినట్లు వైద్యులు పేర్కొన్నారు. తల్లిబిడ్డులు క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మరో రెండు నెలలు గడ్డురోజులే..!