ETV Bharat / state

బెల్ట్​షాపులకు మినహాయింపా..? ఒకటింటికి కూడా మందు అమ్ముతుండ్రు..!

author img

By

Published : May 19, 2021, 3:51 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ వేళ ప్రజల నిత్యావసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత వైన్సులతో సహా అన్ని వ్యాపాల సముదాయాలు మూసేయాలని సర్కారు ఆదేశించింది. బెల్ట్​ షాపులకు ఈ రూల్స్​ వర్తించవనుకున్నాడో ఏమో ఆ దుకాణ యజమాని.. ఒంటిగంటకు కూడా యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నాడు.

belt shop open in tanur mandal after lockdown relaxation timings

లాక్​డౌన్​ వేళ ప్రజలకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరకకపోయినా మద్యం మాత్రం సులభంగా దొరుకుతోంది. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో మందుబాబులకు మద్యం మాత్రం బహిరంగంగానే దొరుకుతుంది. లాక్​డౌన్​ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా బెల్ట్​షాపులో యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు.

ఇందేంటని కొందరు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నా.. పట్టించుకోకుండా దుకాణ యజమానులు తమ పని కానిస్తున్నారు. మందుబాబుల అండతో ధైర్యంగా దందా కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా... అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి బెల్ట్​షాపులను మూసేయించి.. నిబంధనలు పాటించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

బెల్ట్​షాపులకు మినహాయింపా..? ఒకటింటికి కూడా మందు అమ్ముతుండ్రు..!

ఇదీ చూడండి: ఎన్నికల విధులకు హాజరైన 1,673‬ మంది టీచర్లు మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.