ETV Bharat / state

బాసరలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం - బాసరలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలతో తొమ్మిది రోజుల వేడుకలకు అంకురార్పణ జరిగింది.

బాసరలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
author img

By

Published : Sep 29, 2019, 6:04 PM IST

చదువులతల్లి సరస్వతీదేవి నిలయమైన బాసరలో వేకువజామున మంగళ వాయిద్యాల నడుమ వేదపండితులు సుప్రభాతసేవతో దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. మహాభిషేకం నిర్వహించిన అనంతరం విఘ్నేశ్వరపూజ క్షేత్ర పూజతో ఘటస్థాపన చేశారు. భక్తుల సాధారణ దర్శనాలకు ఇబ్బంది కాకుండా అక్షరాభ్యాసాలకు వేర్వేరు మంటపాలు ఏర్పాటు చేశారు.

పటిష్ఠ భద్రత...

శరన్నవరాత్రుల సందర్భంగా బాసర అమ్మవారిని ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్‌ భాస్కర్ రావును ప్రత్యేక అధికారిగా నియమించారు. ఎస్పీ శశిధర్ రాజు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఎప్పటికప్పుడు బాసర పుణ్య క్షేత్రంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

బాసరలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఇదీ చదవండీ... సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి... దసరా ఉత్సవాలు ప్రారంభం

Intro:TG_ADB_61_29_MUDL_BSR MLA SP DARSHANAM....._ AVB_TS10080

note script ftp lo vundi

Body:bsr

Conclusion:bsr

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.