ETV Bharat / state

బాసర ఏఈఓ శ్రీనివాస్​పై మరోసారి సస్పెన్షన్​ వేటు - BASARA

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయ విగ్రహాల తరలింపు, అక్షరాభ్యాస టిక్కెట్లు, లడ్డూ ప్రసాదంలో అవకతవకలు, హుండీ లెక్కింపులో చేతివాటం విషయాల్లో సస్పెండ్​ అయిన ఏఈఓ శ్రీనివాస్ మరోసారి సస్పెండ్ అయ్యారు. అతనితో పాటు మరో నలుగురికి దేవాదాయ శాఖ అధికారులు అవినీతి కేసులో చార్జిమెమోలు జారీ చేశారు.

బాసర ఏఈఓ శ్రీనివాస్​పై మరోసారి సస్పెన్షన్​ వేటు
author img

By

Published : Jul 21, 2019, 8:06 PM IST

బాసర ఏఈఓ శ్రీనివాస్​పై మరోసారి సస్పెన్షన్​ వేటు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో జరిగిన పలు అవకతవకలపై దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు స్పందించారు. ఏఈఓ శ్రీనివాస్​ను మరోసారి సస్పెండ్ చేశారు. అతనితోపాటు మరో ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్​కు దేవాదాయ శాఖ అధికారులు చార్జీమెమోలు జారీ చేశారు.

గతంలో ఆలయ విగ్రహాల తరలింపు కేసులో ఏఈఓ శ్రీనివాస్ హస్తముందంటూ ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై మే నెలలో ఆర్జేడీ కృష్ణవేణి ఇచ్చిన నివేదికల ప్రకారం దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తప్పులు చేసిన పలువురు ఉద్యోగులపై కొరడా ఝులిపించారు. ఆలయ ఏఈఓ శ్రీనివాస్​ను జూన్​ 18న సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ నిలుపుదలపై శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. గత సోమవారం తిరిగి విధుల్లో చేరాడు.

ప్రస్తుతం వారం తిరగకముందే మళ్లీ అక్షరాభ్యాస టిక్కెట్లు, లడ్డూ ప్రసాదంలో అవకతవకలు, హుండీ లెక్కింపులో చేతివాటం చూపించారంటూ బాసర గ్రామస్థులు, భక్తులు దేవాదాయశాఖకు ఫిర్యాదు చేశారు. మరోసారి విచారణ జరిపిన ఆర్జేడీ కృష్ణవేణి నివేదిక మేరకు ఏఈఓ శ్రీనివాస్​ను రెండొసారి సస్పెన్షన్​ వేటు వేశారు. అతనితో పాటు మరో ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు శివరాజ్, సంజీవరావు, భీమ్రావులకు, జూనియర్ అసిస్టెంట్ గోపాలసింగ్​లకు తాఖీదులు జారీ చేశారు.

ఇవీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'

Intro:Body:

Basara

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.