ETV Bharat / state

బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం - Adilabad district latest news

Bandi Sanjay Praja Sangrama Yatra Begins: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. నిర్మల్‌ జిల్లా అడెల్లి పోచమ్మ ఆలయంలో పూజలు చేసిన సంజయ్‌ యాత్రను మొదలుపెట్టారు. అంతకు ముందు ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసాకి మూడు కిలోమీటర్ల దూరం నుంచే సభ నిర్వహిస్తేనే అనుమతించాలని పోలీసులకు న్యాయస్థానం స్పష్టం చేసింది.

Bandi  Sanjay Fifth Phase Praja Sangrama Yatra Begins

author img

By

Published : Nov 28, 2022, 8:00 PM IST

Bandi Sanjay Praja Sangrama Yatra Begins: హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. కరీంనగర్‌ నుంచి నిర్మల్‌కు చేరుకున్న బండి సంజయ్‌కి.. ఎంపీ అర్వింద్‌, పార్టీ శ్రేణలు ఘనస్వాగతం పలికారు. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ గుడిలో సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అడెల్లి పోచమ్మ ఆలయం నుంచే బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు.

బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని తెలిపిన కోర్టు.. ఇతర మతాలకు సంబంధించి ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు, నినాదాలు చేయరాదని పేర్కొంది. సాయంత్రం ఐదింటి వరకు సభ నిర్వహించుకోవాలని షరతు విధించింది. సంజయ్‌ పాదయాత్రకు నిర్మల్‌ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ.. బీజేపీ నేతలు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.

ఈ విచారణలో బండి సంజయ్‌ పాదయాత్ర బైంసాలోకి వెళ్లదని.. ఈ మేరకు రోడ్‌ మ్యాప్‌ను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. ఈ దశలో పాదయాత్ర.. బైంసాలోకి ప్రవేశించనప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. ఇందుకు సమాధానమిచ్చిన ఏజీ బైంసా చాలా సున్నితమైన ప్రాంతమని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు యాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

అంతకుముందు ఉదయం భైంసాలో బీజేపీ బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేనందున నిర్వహించొద్దని భద్రతా అధికారులు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. సభా ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎవ్వరూ ఆ ప్రాంతానికి రావొద్దంటూ బారికేడ్లు ఏర్పాటుచేశారు. కమలం కార్యకర్తలను అదుపులోకి తీసుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

ఇవీ చదవండి: బండి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్​.. నేటి నుంచే ప్రారంభం..

శబరిమల అయ్యప్పకు కానుకల వర్షం 10 రోజుల్లో ఎంతంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.