ETV Bharat / state

ముధోల్‌ నియోజకవర్గంలో బీజేపీని గెలిపించండి, దత్తత తీసుకుంటాను : బండి సంజయ్ - బండి సంజయ్ ఫైర్ ఆన్ కేసీఆర్

Bandi Sanjay Election Campaign in Nirmal : రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం వేర్వేరు కాదని.. అవన్నీ ఒకటేననీ.. ఆ కూటమి తెలంగాణలో మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల బతుకులు దుర్భరమవుతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆరోపించారు. ముధోల్ నియోజకవర్గంలో బీజేపీను గెలిపిస్తే.. దత్తత తీసుకుంటానని తెలిపారు.

Bandi Sanjay Election Campaign in Bhainsa
Bandi Sanjay Adoption Mudhol Constituency
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 5:23 PM IST

Bandi Sanjay Election Campaign in Nirmal : ముధోల్ నియోజకవర్గంలో బీజేపీను గెలిపిస్తే.. దత్తత తీసుకుంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి ఎక్కువ అయిపోయిందని అన్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్(Bandi Sanjay) పాల్గొన్నారు. స్థానిక అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. యువతకు ఆవేశం ఉండాలని.. ఓటును ఆలోచించి వేయాలని సూచించారు.

Bandi Sanjay Latest Comments on KCR : బీజేపీ భైంసాను మైసాగా మార్చే ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్‌, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మతవిద్వేశాలు రెచ్చగొడుతూ తెలంగాణ రాష్ట్రాన్నే భైంసా ప్రాంతంగా మార్చాలని కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ముధోల్​కు రైల్వే లైన్(Railway line to Mudhol) తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన నగదు మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనేనని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నాయని.. బీజేపీ(BJP) దానికి వ్యతిరేకమని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మళ్లీ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధాని మోదీ మద్దతు ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ భయపడుతోందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసినందుకు తనని జైళ్లో ఉంచారని గుర్తు చేశారు. కేసీఆర్‌(KCR) కుటుంబం వల్ల తెలంగాణ రాలేదని.. ప్రజలందరి పోరాటం వల్ల వచ్చిందని వెల్లడించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి ఎక్కడా లేదు - గాల్లో వచ్చిన వాళ్లు గాల్లోనే పోతారు : బండి సంజయ్​

Bandi Sanjay Adoption Mudhol Constituency : సీఎం కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్లు అప్పులు చేశారని.. తల ఒక్కరి మీద సుమారు రూ.లక్షా ఇరవై వేలు అప్పు పెట్టారని బండి సంజయ్ అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే.. ప్రచారం మాత్రం సీఎం కేసీఆర్‌ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 9 ఏళ్లల్లో అభివృద్ధి పనులు చేశామని కేసీఆర్‌ ఎక్కడైనా చెప్పారా అని నిలదీశారు. కేసీఆర్‌ చెప్పుకునేందుకు ఏమీ లేక కేవలం విపక్షాలను తిడుతున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఖతం అయిందని చెప్పారు. ముధోల్‌ నియోజకవర్గంలో బీజేపీను గెలిపిస్తే.. దత్తత తీసుకుంటానని తెలిపారు.

"కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే అవినీతి చేస్తారు. ముధోల్‌ నియోజకవర్గంలో బీజేపీని గెలిపించండి... దత్తత తీసుకుంటాను. ప్రజల పక్షాన పోరాటం చేసినందుకు నన్ను జైళ్లో ఉంచారు. కేసీఆర్‌ కుటుంబం వల్ల తెలంగాణ రాలేదు.. ప్రజలందరి పోరాటం వల్ల వచ్చింది."- బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Bandi Sanjay Fire on Congress : కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌(Congress) నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఆరు స్కీమ్‌లు, అరడజను ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​లోకి వెళ్లిపోతారాని.. అలా వెళ్లకుండా ఉండగలరా అని ప్రశ్నించారు. దీనివల్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసినా వృథా అవుతుందని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే మళ్లీ అవినీతి పెరుగుపోతుందని మండిపడ్డారు.

కేసీఆర్​ మరోసారి సీఎం అయితే ఆర్టీసీ ఆస్తులను అమ్మేస్తారు : బండి సంజయ్​బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే వర్గం కోసం పనిచేస్తున్నాయి : బండి సంజయ్

పేదోళ్లు ఉద్యమం చేస్తే, పెద్దోళ్లు రాజ్యం ఏలుతున్నారు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.