ETV Bharat / state

సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యకు నిరసనగా బాసర బంద్‌ - Bandh in Basara

Bandh in Basara : నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞానసరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేశ్​​ని అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు, సిబ్బంది సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. వ్యాపారులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.

basara protest
basara protest
author img

By

Published : Jan 3, 2023, 11:45 AM IST

Bandh in Basara : జ్ఞానసరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్​ చేసిన అనుచిత వ్యాఖ్యలను స్థానికులు, విద్యార్థులు, అర్చకులు ఖండించారు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్​ను అరెస్టు చేయాలంటూ నిర్మల్ జిల్లా బాసరలో ఆందోళన చేపట్టారు. వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. స్థానికులు, వ్యాపారస్థులు, విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు, సిబ్బంది సేవలను నిలిపివేసి నిరసన తెలిపారు. రాజేశ్​​ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. నిజామాబాద్‌-భైంసా రహదారిపై రాస్తారోకోకు దిగడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.