ETV Bharat / state

వేధింపులను అడ్డుకోవాలంటూ ఆశాల వినతిపత్రం - నిర్మల్​లో ఆశా కార్యకర్తల వార్తలు

ఆశా కార్యకర్తలపై మెడికల్​ ఆఫీసర్​ వేధింపులను అరికట్టాలంటూ నిర్మల్​ జిల్లా లక్ష్మణచాంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే ఆశాలు జిల్లా వైద్యాధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. తమను ఇబ్బంది పెడుతున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని.. తమపై ఒత్తిడి తగ్గించాలని కోరారు.

nirmal asha workers protest against harassments
మెడికల్​ ఆఫీసర్​ వేధింపులను అడ్డుకోవాలంటూ ఆశాల వినతిపత్రం
author img

By

Published : Sep 22, 2020, 8:43 PM IST

నిర్మల్​ జిల్లా లక్ష్మణచాంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలపై మెడికల్​ ఆఫీసర్​ వేధింపులను అరికట్టాలని డిమాండ్​ చేస్తూ ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. మెడికల్​ ఆఫీసర్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా వైద్యాధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.

కరోనా కాలంలోనూ కష్టపడి పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఆశా కార్యకర్తల సేవలను ప్రభుత్వం గుర్తించట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా మెడికల్ ఆఫీసర్​ దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. తమను ఇబ్బంది పెడుతున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని.. తమపై ఒత్తిడి తగ్గించాలని కోరారు.

ఇదీ చదవండిః స్థిరవేతనం చెల్లించాలని ఆశావర్కర్ల డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.