నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గతంలో ప్రభుత్వం తమకు కనీస వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిందనీ.. నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు.
రోజురోజుకు పని భారం పెరుగుతోంది కానీ సరైన పారితోషికం అందట్లేదని వాపోయారు. శాంతియుతంగా ధర్నా చేపడుతుంటే ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో అరెస్టులు చేయిస్తోందన్నారు. సర్కారు వెంటనే స్పందించి ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండిః కరోనా నుంచి కాపాడుకోండిలా!