కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సంఘం సభ్యులు ధర్నా చేపట్టారు.
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలకు అనుసంధానం చేయవద్దని ప్రభుత్వాన్ని సీఐటీయూ నిర్మల్ జిల్లా కార్యదర్శి సుజాత కోరారు. వాటిని ప్రీ స్కూల్ కేంద్రాలుగా పరిగణించాలని విన్నవించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రాజమణి, ఉపాధ్యక్షులు శశికళ, వనజ స్వరూపరాణి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు