ETV Bharat / state

ప్రమాదాలు జరుగుతున్నా... పట్టించుకోని అధికారులు - basara

బాసర... పేరు వినగానే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సరస్వతిదేవి, గోదావరి గుర్తుకొస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లేందుకు మాత్రం సరైన రోడ్డు లేదు. నిజామాబాద్- బాసర మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా... పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోగా ప్రయాణికుల పాలిట మృత్యుకూపంగా మారుతున్నాయి.

ప్రమాదాలు జరుగుతున్నా... పట్టించుకోని అధికారులు
author img

By

Published : Aug 6, 2019, 8:47 AM IST

నిజామాబాద్​ నుంచి బాసర మార్గంలో ఎడపల్లి మండలం జానకంపేట నుంచి నవీపేట మండలం ఫకీరాబాద్ వరకు 14.45 కి.మీ.ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 50కోట్లు మంజూరయ్యాయి. 2017 మార్చిలో పనులు కూడా ప్రారంభించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 68 కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికి 56పూర్తి చేశారు. 10కి.మీ.ల వరకు మెటల్ రోడ్డు, 500 మీటర్ల వరకు బీటీ పనులు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరు పరిశీలిస్తే గడువులోగా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రమాదాలు జరుగుతున్నా... పట్టించుకోని అధికారులు
నిర్మాణపనుల వల్ల రెండు వరుసలున్న పాత బాసర బీటీ రోడ్డుపై లెక్కకు మించిన సంఖ్యల్లో గుంతలు ఏర్పడ్డాయి. కల్వర్టుల వద్ద ఉండే గుంతలు సరిగా పూడ్చకపోవడం వల్ల అవి మరింత ఇబ్బందికరంగా మారాయి. రాత్రి వేళల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటోందంటూ స్థానికులు వాపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అసలే వర్షాకాలం... వర్షపు నీరు నిలిచిపోవడం, దుమ్ము ఎగజిమ్ముతుండటం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా.. 38 మంది గాయపడ్డారు. మృతులతో పాటు గాయాల బారిన పడ్డ వారిలో సగానికి పైగా బాసర క్షేత్రానికి వెళ్లేవారే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాకు బస్సులు ఈ దారి గుండానే వెళ్తాయి. అంతర్ రాష్ట్ర రహదారి అయినా.. ఈ నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. రెండేళ్ల నుంచి ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటే నరకం చూస్తున్నామని... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేదంటే మరింత మంది ప్రమాదాల బారిన పడి చనిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: అయోధ్య కేసులో నేటినుంచి రోజువారీ విచారణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.