నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన ఎడ్ల కళావతి మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా భజన కార్యక్రమానికి వెళ్లింది. కానీ తిరిగిరాలేదు. కళావతి అదృశ్యంపై ఆమె ఇంటి ఎదురుగా ఉన్న తోట నరేశ్ కుటుంబంపై అనుమానం ఉందని పోలీసులకు గ్రామస్థులు తెలిపారు.
ఆమె కుమారుడు మహేశ్ ఫిర్యాదుతో గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సారంగపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా... శనివారం హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. కళావతిని తానే హత్య చేసినట్లు అంగీకరించిన నరేశ్... మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి తల్వెద గ్రామ చెరువులో పడేసినట్లు చెప్పాడు.
దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు నిందితుడు ఇంటిపై దాడికి దిగారు. నిందితుల్ని తమకు అప్పగించాలని ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో... డీఎస్పీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు.
ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'