Train on road: చుక్ చుక్ రైలు రోడ్లపై పరుగులు తీస్తోంది. రహదారులపై పరుగెడుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదంతా ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల కోసం తయారు చేసిన ప్రత్యేక రైలు. పిల్లలను పాఠశాలకు రప్పించేందుకు వినూత్న ఆలోచనతో రైలును రూపొందించారు. నిర్మల్ జిల్లా భైంసా రహదారులపై రైలు పరుగులు తీయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైలులో చిన్నారులను కూర్చోబెట్టుకొని రోడ్లపై తిప్పుతున్నారు.
మా పాఠశాలలో చిన్నపిల్లల కోసం ఈ-ట్రైన్ తీసుకొచ్చాం. చిన్నపిల్లలకు ఆహ్లాదకరంగా ఉండడం కోసం.. ఈ- ట్రైన్ కావున పర్యావరణం కాలుష్యం తగ్గించడం మా ప్రధాన ఉద్దేశ్యం. చిన్న పిల్లలను ఆకట్టుకునేందుకు ఇది ఒక ప్రయత్నం. వారు ఆడుతూ, పాడుతూ ఉండేందుకు రైలు తీసుకొచ్చాం. ఎలక్ట్రానిక్ వాహనాలపై ప్రజలకు దీని ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. - శ్రీనివాస్, ఉపాధ్యాయుడు
చిన్నారులను ఆకట్టుకునేందుకు మూడు డబ్బాలతో రైలులా ఉన్న ప్రత్యేక వాహనాన్ని తెప్పించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ రైలును గత కొన్ని రోజుల ముందు తమ పాఠశాలకు తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులకు మానసిక ఆరోగ్యం కల్పించేందుకని వివరించారు. చిన్నారులు చదువుతో పాటు ఆహ్లదకరంగా గడపడం కోసం ఛార్జింగ్ బ్యాటరితో నడిచే రైలు తీసుకొచ్చామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: Kishan reddy on TRS: అవినీతిని ప్రశ్నించేవారిపై కేసులు పెడతారా?: కిషన్ రెడ్డి