బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఓ ముస్లిం యువకుడు దర్శించుకున్నారు. హైదరాబాద్కు చెందిన యువ గాయకుడు షేక్ ఇందాద్ అలీ గురువారం బాసరకు వచ్చారు. హారతి సమయంలో అమ్మవారిని అర్చిస్తూ పాటలు ఆలపించాడు.
తాను ముస్లిం అయినా చదువుల తల్లిని కొలుస్తానని, తనకు గాత్రం అమ్మవారు ఇచ్చిన వరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, భక్తులు అలీని అభినందించారు.