తాను సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఇర్ల సాయన్న అనే రైతు పురగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతును స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ పొలం తనది కాదంటూ.. కరెంట్ స్టాటర్ బాక్స్‌ను రెవెన్యూ అధికారులు తీసివేశారని, దీని వల్లనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి కుమారుడు తెలిపారు. తమకున్న 5 ఎకరాల భూమిని 16 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నామని బాధితుని కుమారుడు విజయ్ తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కక్ష్యసాధింపుకు కోసమే ఈ విధంగా పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇదీచూడండి:'సీఆర్ఏ-రూట్ జోన్'తో మొక్కలకు బూస్ట్