సాధారణంగా 5 నుంచి 10 కిలోల చేప దొరికితేనే ఆనందం తట్టుకోలేరు. అలాంటిది మూడు రెట్లు ఎక్కువ బరువున్న చేప తమ వలలో పడడంతో నిర‌్మల్ జిల్లాలో మత్స్యకారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోన్ మండలం గాంధీనగర్ గ్రామంలోని జాలర్లకు గోదావరిలో పెద్ద చేప దొరికింది.
దాని బరువు 27 కిలోలు ఉంటుందని... 3 వేలకు పైగా ధర ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. స్థానికంగా ఇంత పెద్ద చేప లభించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. చేపను చూసేందుకు స్థానికులు పోటీపడ్డారు. సెల్ఫీలు దిగి సంబురపడ్డారు.
ఇదీ చూడండి: 17 రోజుల తర్వాత లక్షణాల్లేకుంటే మళ్లీ పరీక్ష అక్కర్లేదు!