నిర్మల్ జిల్లా కేంద్రంలో నివసించే గంప భాగీరథ(97) కరోనా మహమ్మారిని జయించారు. పట్టణంలోని ప్రియదర్శినీనగర్ కాలనీకి చెందిన గంప శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో అందరూ పరీక్షలు చేయించుకున్నారు. వారందరికీ పాజిటివ్ నిర్ధరణ కావడంతో భాగీరథ ఆరోగ్యంపై మొదట ఆందోళన చెందారు.
వైద్యులు సూచించిన మందులు వాడుతూ ఆమె జాగ్రత్తలు పాటించారు. గురువారం రోజున మరోసారి కరోనా పరీక్షలు చేయించగా అందరికీ నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. 97 ఏళ్ల వయసులోను ఏ మాత్రం అధైర్యపడకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడి మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఇదీ చదవండి: లోకల్ ఆన్‌లైన్ యాప్.. ఉపాధి కల్పిస్తున్న సోదరద్వయం