నిర్మల్ జిల్లా సోన్పోలీస్ స్టేషన్ పరిధిలోని కడ్తాల్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేశారు. తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పాత్రలు లేని 83 మోటారు సైకిళ్లు, 3 ఆటోలు, అనుమతి లేని రూ. 13,350 విలువగల మద్యం స్వాధీనం చేసుకున్నారు. యూపీ రాష్ట్రానికి చెందిన ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
శాంతి భద్రతల పరిరక్షణ కేవలం పోలీసు శాఖది మాత్రమే కాదని..ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ప్రజలు తమకు సహకరించినప్పుడే ప్రతి ఒక్కరికి సరైన రక్షణ కల్పించగలమని పేర్కొన్నారు. ప్రజల్లో పోలీసులపై భయాందోళనలు తొలగించడానికే ఈ నిర్బంధ తనిఖీలు చేపడుతున్నామన్నారు.
అవగాహన కల్పించడం..
అసాంఘిక కార్యకలాపాలు, చట్ట విరుద్ధమైన పనులు చేయకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐలు, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నకిలీ కూపన్లు సృష్టించి.. యథేచ్ఛగా ఇసుక దందా