నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా అప్పటి ప్రజలందరినీ ఐకమత్యం చేయాలనే ఉద్దేశంతో వినాయకుని నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన బాలగంగాధర్ తిలక్ మొట్టమొదటిసారిగా పూణేలో వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో 1921 సంవత్సరంలో భైంసాలో గణేష్ నగర్‌లోని హత్తి గణేష్‌గా పేరుపొందిన వినాయకుని ప్రతిష్టించారు.
ఈ గణనాథుని ప్రతిష్టించి ఈ ఏడాదికి వంద సంవత్సరాలు పూర్తి కావడం వల్ల మండలి నిర్వాహకులు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హత్తి గణేష్ మండలి వారికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం నిమజ్జనం సమయంలో వీరు ఒక ఏనుగు ఆకారంలో కూడిన వాహనాన్ని తయారు చేసి దానిపై ఊరేగించి భాజాభజంత్రీలతో, సంస్కృతిక కార్యక్రమాలతో నిమజ్జనం చేస్తారు.
వినాయకుని ఉత్సవాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని పూణేలోని ఒక వాడలో బాలగంగాధర్ తిలక్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత భైంసా పట్టణంలోని గోపాలకృష్ణ మందిరంలో 1919 సంవత్సరంలో గణేశ్ విగ్రహం ప్రతిష్టించారు బాలగంగాధర తిలక్‌ను ఆదర్శంగా తీసుకుని రెండు సంవత్సరాల తర్వాత 1921వ సంవత్సరంలో సార్వజనిక్ హత్తి గణేష్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు.
ఇవీ చూడండి: దసరాకు అందుబాటులోకి ఖమ్మం ఐట్ హబ్: మంత్రి పువ్వాడ