నారాయణపేట జిల్లాలోని ఎక్లాస్పూర్ లోకపల్లి లక్ష్మమ్మ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు. శ్రావణ శుక్రవారం కావడం వల్ల మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇక్కడ పూజలు చేసిన వారికి స్వయంగా వరలక్ష్మి తమ ఇంటికి చేరుతుందని భక్తుల నమ్మకం. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చూడండి : ఎద్దుల ప్రాణం తీసిన స్తంభం... శోకసంద్రంలో కుటుంబం