నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఏటీఎంను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఒకసారి వేసిన విత్తనాలనే... నాలుగైదు సార్లు వేయడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుందన్నారు. అధిక దిగుబడి కోసం ఆధునూతన పద్ధతులను పాటించాలని సూచించారు. మహిళా సంఘాలు ఇతర బ్యాంకుల్లో కాకుండా డీసీసీబీలోనే లావాదేవీలు చేయడానికి బ్యాంకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
రైతులందరూ సమష్టిగా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పండించిన పంటను, విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేయాలన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ , బ్యాంకు అధికారులు, జిల్లా జడ్పీ ఛైర్మన్ వనజ, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'సహకార బ్యాంకును మహిళా సంఘాలే అభివృద్ధి చేసుకోవాలి' - ఏటీఎంను వ్యవసాయ శాఖ మంత్రి
నూతన జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతో పాటు ఏటీఎంను నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఇతర బ్యాంకులకు దీటుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.