అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తీవ్రంగా హెచ్చరించారు. నారాయణ పేట జిల్లా అప్పిరెడ్డి పల్లిలోని పలు అనుమానిత ఇళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సోదాల అనంతరం రేషన్ బియ్యాన్ని ఎవరూ అధిక ధరకు అమ్ముకోకూడదని గ్రామసభలో తీర్మానం చేయించారు. పలువురు గ్రామ పెద్దలను కలసి ప్రజలు రేషన్ బియ్యం అమ్మకుండా చూడాలని ఆదేశించారు.
గతంలోను ఇలా..
గతంలో సైతం సింగిల్ విండో డైరెక్టర్ వద్ద నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని అధిక ధరకు అమ్మకూడదని.. గ్రామస్థులు నేర రహిత నేపథ్యం కలిగి ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: మందుబాబుల మనసు మారే.. బీరు నుంచి లిక్కర్‌కు చేరే..!