నారాయణపేట జిల్లా కేంద్రంలోని పలు బ్యాంకుల ఎదుట ప్రజలు బారులుతీరారు. వ్యక్తుల మధ్య కనీస భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా నిల్చున్నారు. వీరిని లైన్లలో నిలబెట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఖాతాదారులంతా వరుసల్లో నిలబడి డబ్బులు తీసుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులు మొరపెట్టుకుంటున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు