ETV Bharat / state

'పది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి' - ssc exams in narayanapeta

నారాయణపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ హరిచందన తెలిపారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు రసాయన ద్రావణాలతో పిచికారీ చేయిస్తామని వెల్లడించారు.

ssc examination arrangements in narayanapeta district
'పది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి'
author img

By

Published : Jun 2, 2020, 3:28 PM IST

పదో తరగతి పరీక్షలకు నారాయణపేట జిల్లా సన్నద్ధంగా ఉందని కలెక్టర్ హరిచందన తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజు రసాయన ద్రావణాలు పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల హాల్​ టికెట్​, పరీక్షా కేంద్రాల వివరాలు, చరవాణికి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముఖానికి మాస్కు ధరించాలని, చేతులకు శానిటైజర్ రాసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులంతా పరీక్షకు హాజరై వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ అధికారులు వాట్సాప్ ద్వారా పాఠాలు బోధించాలని అధికారులకు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.