నారాయణపేట జిల్లాలో మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎస్పీ డాక్టర్ చేతన 'నీ నేస్తం' అనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు ఎన్ని సమస్యలు ఉన్నా తమలోనే దాచుకొని సతమవుతున్నారని చేతన తెలిపారు. అలాంటివారిని స్వయంగా కదిలించినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పేవారు కానీ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయలేకపోయారని వెల్లడించారు. ఈ ఘటనల దృష్ట్యా 'నీ నేస్తం' అనే ఓ బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో ఎవరైనా తమ సమస్య గురించి ఒక పేపర్‌పై రాసి... బాక్స్లో వేస్తే సరాసరి తన వద్దకు వస్తుందని పేర్కొన్నారు. నీ నేస్తం బాక్స్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా భావించి వాటిలో తమ సమస్యను నిర్భయంగా రాసి తమకున్న ఇబ్బందులు తొలగించుకోవచ్చని ఎస్పీ చేతన తెలిపారు.
మహిళలకు చేయూతగా 'నీ నేస్తం'
మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు నిరాకరిస్తున్నారని... అలాంటి వారు బయటకు వెళ్లకుండా నేరుగా తమ సమస్యలను ఫిర్యాదు చేసే విధంగా 'నీ నేస్తం' అనే వినూత్న కార్యక్రమానికి ఎస్పీ చేతన శ్రీకారం చుట్టారు.
నారాయణపేట జిల్లాలో మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎస్పీ డాక్టర్ చేతన 'నీ నేస్తం' అనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు ఎన్ని సమస్యలు ఉన్నా తమలోనే దాచుకొని సతమవుతున్నారని చేతన తెలిపారు. అలాంటివారిని స్వయంగా కదిలించినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పేవారు కానీ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయలేకపోయారని వెల్లడించారు. ఈ ఘటనల దృష్ట్యా 'నీ నేస్తం' అనే ఓ బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో ఎవరైనా తమ సమస్య గురించి ఒక పేపర్‌పై రాసి... బాక్స్లో వేస్తే సరాసరి తన వద్దకు వస్తుందని పేర్కొన్నారు. నీ నేస్తం బాక్స్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా భావించి వాటిలో తమ సమస్యను నిర్భయంగా రాసి తమకున్న ఇబ్బందులు తొలగించుకోవచ్చని ఎస్పీ చేతన తెలిపారు.
Contributor:- J.Venkatesh ( Narayana per). 9394450173
Centre:- Mahabub agar
(. ). నారాయణపేట జిల్లాలో మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు స్థానిక ఎస్పీ డాక్టర్ చేతన నీ నేస్తం అనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహిళలు నిత్యం తాము ఎదుర్కొంటున్న సమస్యలను పోలీస్ స్టేషన్కు వచ్చి చెప్పేందుకు నిరాకరిస్తున్నారని ఎలాంటి బయటకు వెళ్లకుండా నేరుగా తమ సమస్యలను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వారిలో చైతన్యం తీసుకురావాలని ఈ నేస్తం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ఎస్పి 14వ వార్డు లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్దేశించి చెప్పారు
Body:నారాయణపేట జిల్లాలో ట్రైనింగ్ నిర్వహించిన సమయంలో కోసిగి ప్రాంతంలో మహిళలు ఎన్ని సమస్యలు ఉన్నా తనలోనే దాచుకొని వంటి సమస్యలతో సతమతమయ్యే వారిని వారిని తాను స్వయంగా కదిలించినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలు 1 తనముందు సమస్యలు వినిపించేవారు ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని నీ నేస్తం అనే ఓ బస్సు ఏర్పాటు చేసి అందులో ఎవరైనా తాము తమ జీవితంలో భర్తతో గాని అత్తతో గాని మిగతా ఏ సమస్య ఉన్నా నేరుగా ఒక పేపర్ పై వ్రాసి ఈ బాక్స్ లో వేస్తే సరాసరి తన చేతికి వచ్చి పడుతుందని డాక్టర్ ఎస్పీ తెలిపారు కావున మహిళలు సంసారం గాని ఇతర ఆకతాయిల బెడద ఏవైనా సమస్యలు ఉన్నా మరియు చదువుకునే విద్యార్థులు సైతం ఆకతాయిల బెడద ఏమైనా ఉంటే ఈ నేస్తం బాక్స్లో చీటి రాసి వేయాలని ఆమె కోరారు
Conclusion:నీ నేస్తం బాక్స్ ఓ పోలీస్ స్టేషన్ గా భావించి వాటి లో తమ సమస్యను నిర్భయంగా వ్రాసి ఇ ఈ చిత్రం ద్వారా తమకున్న ఇబ్బందులను తొలగించుకోవచ్చు నారాయణపేట ఎస్పీ డాక్టర్ చైతన తెలిపారు