నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో రికార్డు స్థాయిలో 17 మంది శిశువులు జన్మించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన కాన్పుల్లో ఇంతమంది జన్మించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. మొత్తం 16 ప్రసవాలు కాగా.. అందులో 2 సాధారణం, 14 సిజేరియన్లు చేశామన్నారు. వారిలో ఓ ఆపరేషన్లో కవలు జన్మించినట్లు చెప్పారు. కవల పిల్లలలో ఒకరికి గ్రహణ మొర్రి ఉండడం వల్ల ఆ బిడ్డను నిలోఫర్ ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్లు వెల్లడించారు. మిగతా శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. చిన్నారుల్లో 5 గురు మగ, 12 మంది ఆడశిశువులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'మద్దతు ధరకు వ్యూహం రూపొందించండి'