నారాయణపేట జిల్లా ఎక్లాస్ పూర్ దగ్గర అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది వరకే ఒకసారి పోలీసులకు దొరికిన వ్యక్తే మళ్లీ అక్రమంగా బియ్యాన్ని తరలిస్తూ దొరికిపోయాడు.
సదురు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా పీడీఎస్ బియ్యం అమ్మినా... అక్రమ రవాణా చేసినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.