నారాయణ పేట జిల్లా మద్దూరు మండలం దొరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణపేట వైపు వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: పదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం