నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వనజ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సరైన సమయంలో పౌష్టికాహారం అందించి మాతాశిశు మరణాలను అరికట్టడంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గర్భిణీలకు పోషకాహారం ఇవ్వడం ద్వారా ఆరోగ్య వంతమైన సంతానం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, మక్తల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరసింహగౌడ్, పీడీ జైపాల్‌రెడ్డి, సీడీపీవో సరోజిని, పలువురు అంగన్వాడ్ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!