ఉపాధ్యాయునిగా సేవలందించి.. రాష్ట్రపతిగా ఎదిగిన దివంగత సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర ఆయన దేశానికి చేసిన సేవలను నారాయణపేట కలెక్టర్ వెంకట్రావ్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో రెవెన్యూ సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయులకు కలెక్టర్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వనజ అవార్డులు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేస్తూ... విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పలువురు వక్తలు సూచించారు.నారాయణపేట జిల్లాలో 14 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు.
ఇవీచూడండి: మెగాస్టార్ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..?