ETV Bharat / state

యానిమేషన్స్​ రూపొందించే స్థాయికి ఎదిగిన గ్రామీణ విద్యార్థులు - టిటా ఆన్​లైన్​ శిక్షణా తరగతుల వార్తలు నారాయణ పేట జిల్లా

గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే.. వారిలో దాగి ఉన్న నైపుణ్యాల్ని వెలికి తీయవచ్చని నిరూపించింది నారాయణపేట జిల్లా విద్యాశాఖ. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన నిరుపేద విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలను ఆన్​లైన్ శిక్షణ ద్వారా నేర్పించింది. స్మార్ట్ ఫోన్​లో ఓనమాలు కూడా తెలియని విద్యార్థులు ప్రస్తుతం స్వతహాగా యానిమేషన్స్, గేమ్స్ రూపొందించే స్థాయికి ఎదిగారు.

యానిమేషన్స్​ రూపొందించే స్థాయికి ఎదిగినా గ్రామీణ విద్యార్థులు

author img

By

Published : Oct 10, 2020, 7:26 PM IST

యానిమేషన్స్​ రూపొందించే స్థాయికి ఎదిగినా గ్రామీణ విద్యార్థులు

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే వారి ప్రతిభకు ఎలా పదును పెడతారో.. ఎలాంటి ఫలితాలు సాధిస్తారో మరోసారి నిరూపించారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు. నారాయణపేట విద్యాశాఖ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేన్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 నుంచి 25 వరకు డిజిటల్ కోడింగ్ విధానంపై ఆన్​లైన్​లో శిక్షణ అందించారు.

13 ప్రభుత్వ పాఠశాలల నుంచి..

అందుకోసం స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండే 8,9వ తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థులను.. 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి ఎంపిక చేశారు. వీరికి సహాయకులుగా ఉండేందుకు ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయున్ని ఎంపిక చేసి వారిని శిక్షణలో భాగస్వాములను చేశారు. శిక్షణ సులువుగా ముగిసేందుకు రోజూ రాత్రి ఏడు నుంచి ఎనమిదిన్నర గంటల వరకూ జూమ్ యాప్ ద్వారా కోడింగ్​పై శిక్షణ అందించారు. ఫలితంగా.. స్మార్ట్ ఫోన్ వినియోగించడంలో ఓనమాలు కూడా తెలియని పిల్లలు ప్రస్తుతం కోడింగ్ ద్వారా యానిమేషన్ చేయడం, సొంతంగా మొబైల్​లో ఆటలు రూపొందించే స్థాయికి ఎదిగారు. టీటా అందించిన ఈ శిక్షణ విద్యార్థుల సామర్థ్యాలను వెలికి తీయడంతోపాటు.. వారిపై నమ్మకాన్ని పెంచిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

వీడియో గేమ్స్​​ తయారు చేసేలా..

కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? కంప్యూటర్​తో కమ్యూనికేషన్ ఎలా చేయాలి? ప్రోగ్రామింగ్, అల్గారిథం, కోడింగ్ అంటే ఏమిటి? వాటిని ఎలా చేయాలన్నది శిక్షణలో ఆన్​లైన్​లోనే నేర్పించారు. ప్రాథమికంగా ప్రోగ్రామింగ్ ఎలా రాయాలనే విషయాన్ని బోధించారు. పైథాన్ ద్వారా గేమ్స్, యానిమేషన్స్ నేర్పిస్తారు. రెండు వారాల శిక్షణ అనంతరం ప్రాథమిక స్థాయి వీడియో గేమ్ తయారు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యం. శిక్షణ అనంతరం ర్యాట్ అండ్ క్యాట్, ప్రత్యేక రోజుల్లో యానిమేషన్స్ ద్వారా గ్రీటింగ్స్ లాంటివి విద్యార్థులు సొంతంగా తయారు చేసి వారి ప్రతిభను చాటుకున్నారు.

లక్ష మందికి కోడింగ్​ స్కిల్స్​ నేర్పడమే లక్ష్యం

సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి కోడింగ్ చేసే నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రాథమిక స్థాయి కోడింగ్ నైపుణ్యాలైనా తప్పనిసరిగా ఉండాలని సాఫ్ట్ వేర్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఇటీవల నూతన విద్యావిధానంలో కోడింగ్ స్కిల్స్​ని తప్పనిసరి చేసింది. విదేశాల్లో ఆరో గ్రేడ్ నుంచే కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2020 నాటికి లక్ష మందికి కోడింగ్ స్కిల్స్ నేర్పాలని లక్ష్యంగా పెట్టుకుంది టీటా. అందులో భాగంగానే వనపర్తిలో విద్యార్థులకు ఇప్పటికే శిక్షణ అందించారు. తాజాగా మక్తల్ విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆన్​లైన్​లో కాకుండా నేరుగా క్లాస్ రూంలో ఇలాంటి శిక్షణలు అందిస్తే విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరచడానికి మరింత ఉపయోగకరంగా ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన ప్రత్యేక చొరవతో ఆ జిల్లాలో టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తాల ఆధ్వర్యంలో నారాయణపేట విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో మరికొన్నిచోట్ల అమలు చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇదీ చదవండి: గ్రామీణ విద్యార్థులకు టిటా బృందం డిజిటల్ శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.