ETV Bharat / state

మక్తల్​లో పూర్తి స్థాయిలో టెలిమెడిసిన్ సేవ‌లు ప్రారంభం

నారాయణపేట జిల్లాలోని మక్తల్​లో దేశంలోనే తొలిసారిగా ఆన్​లైన్ వైద్య సేవలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మక్తల్​లో  ఆన్లైన్ వైద్య సేవలు ప్రారంభం
మక్తల్​లో ఆన్లైన్ వైద్య సేవలు ప్రారంభం
author img

By

Published : Apr 8, 2020, 8:53 PM IST

నారాయణ పేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా ఆన్లైన్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వైద్య‌ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) డిజిథాన్ కృషితో మ‌క్త‌ల్​లో టెలిమెడిసిన్ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.`టీ క‌న్స‌ల్ట్` పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్టును హైదరాబాద్​లో శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి ప్రారంభించారు.

హోమియోకు సంబంధించి జీయ‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (జిమ్స్‌) బృందాన్ని ఆన్‌లైన్ సేవ‌లకు అందుబాటులోకి తెస్తామ‌ని జీయ‌ర్ హామీ ఇచ్చారు. ఆన్‌లైన్ సేవల్లో భాగంగా మండ‌లంలోని 39 గ్రామ పంచాయ‌తీలు వైద్య సేవ‌లు పొంద‌నున్నాయి. క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న స్వ‌యంగా ఆహ్వానించిన నేప‌థ్యంలో టీటా నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌కు ప్రాథ‌మిక శిక్ష‌ణ పూర్తి చేసింది.

ఇవీ చూడండి : కరోనాపై పోరుకు కొత్త సైన్యం- ఆన్​లైన్​లో శిక్షణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.