ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విరిగిపోయిన స్తంభాల స్థలంలో... నూతన స్తంభాల పనులు చేపడుతుండగా విద్యుత్​షాక్​తో మృతిచెందిన ఘటన మక్తల్​లో చోటు చేసుకుంది. లైన్​మెన్ నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగినట్లు స్థానికులు ఆరోపించారు.

one-person-died-with-current-shock-at-makthal
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : May 20, 2020, 5:36 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన తాయప్ప కొంత కాలంగా గ్రామంలోని కాంట్రాక్ట్ పోల్స్ మరమ్మతులు చేసే వెంకటేష్ దగ్గర పని చేస్తున్నాడు. పనుల్లో భాగంగా ముస్లయిపల్లి గ్రామంలో విరిగిపోయిన స్తంభాల స్థలంలో... నూతన స్తంభాల పనులు చేపడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. లైన్​మెన్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'రైతులకు ఏ పంట వేయాలో చెప్పడం సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.