ETV Bharat / state

ఎక్కడి కంకర అక్కడే.. నత్తనడకన తారు రోడ్డు పనులు...

నారాయణపేట జిల్లాలో తారు రోడ్డు నిర్మాణ పనులు శిలాఫలకాలు, కంకర కుప్పలకే పరిమితమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంజూరు కాగా అప్పటి పాలకులు అట్టహాసంగా భూమి పూజలు చేశారు. కానీ ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాల్లో ప్రగతి మాత్రం కనిపించడం లేదు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. పలుచోట్ల రోడ్లు కోసుకుపోయి గుంతలు పడ్డాయి. నీళ్లు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

author img

By

Published : Sep 20, 2020, 2:12 PM IST

no-development-in-road-construction-works-at-narayanpet-district
ఎక్కడి కంకర అక్కడే.. నత్తనడకన తారు రోడ్డు పనులు...

కొత్తరోడ్లు వేస్తే నడక సమస్యలు తీరుతాయని.. ప్రయాణం ప్రమాద రహితంగా సుఖవంతంగా సాఫీగా సాగిపోతుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురయ్యింది. నారాయణపేట జిల్లాలోని ధన్వాడ, ఉట్కూర్, మరికల్, దామరగిద్దతోపాటు మిగతా మండలాలకు తారురోడ్లు నిర్మాణాల కోసం సుమారు రూ. 50 కోట్లకుపైగా నిధులు మంజూరు అయ్యాయి. కాగా ఉట్కూరు మండలంలో ఆరు రోడ్లు, దామరగిద్దలో మూడు రోడ్లు, ధన్వాడ మండలంలో 5 రోడ్లు అసంపూర్తిగా మిగిలాయి. మిగతా మండలాల్లోనూ తారురోడ్లు మధ్యలోనే ఆగిపోయాయి. వీటన్నింటికీ భూమి పూజలు నిర్వహించి రెండు ఏళ్లు దాటినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి.

కంకరేసి చేతులు దులుపుకున్నారు..

కొన్ని చోట్ల గుత్తేదారులు రహదారులకు ఇరువైపులా ఉన్న ముళ్లకంపను తొలగించి చేతులు దులిపేసుకున్నారు. తొలగించిన చోట్లా మళ్లీ చెట్లు మొలకెత్తాయి తప్ప పనులు మాత్రం అంగుళం ముందుకు కదలలేదు. కొన్నిచోట్ల కంకర కుప్పలు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పనులు కల్వర్టుల నిర్మాణాలకే పరిమితమయ్యాయి.

వర్షంతో మరింత ఇబ్బంది..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు మరింత దెబ్బతి.. కోసుకుపోయి లోతైన గుంతలుపడి నీళ్లు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో నిత్యావసరాలు తెచ్చుకోవడానికి, ప్రమాదాలు జరిగిన సందర్భాలలో ఆసుపత్రుల కోసం పెద్ద గ్రామాలకు వెళ్లేందుకు ఆయా గ్రామాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.

జిల్లాకు 20 కిలోమీటర్ల సమీపంలో ఉన్న మా ఊరి రోడ్ల అభివృద్ధి పనులే ఇంత అద్వానంగా ఉంటే మారుమూల గ్రామాలకు ఏవిధంగా పనులు అందుతాయి.. అధికారులు మాయందు దయ ఉంచి త్వరితగతిన మాఊర్లో రోడ్డు పనులను పూర్తి చేయండి: గ్రామస్థులు

విద్యార్థులు ముసలివాళ్లు కాలేజీలకు, ఆసుపత్రులకు వెళ్లేందుకు దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఉంది. రోడ్ల లేకపోవడం.. మట్టిరోడ్డు గుంతలు పడి ఉండడం వల్ల రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు- గ్రామస్థులు

తమ ఊరికి మంజూరైన రహదారులను తారు రోడ్లుగా మార్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: ఆయిల్ ఫామ్ సాగులో అధిక ఆదాయానికి ప్రత్యేక నమూనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.