నారాయణపేట జిల్లాలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దన్వాడ, నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిచందన హాజరయ్యారు. పల్లె ప్రకృతి వనంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ హరిచందన కోరారు. మొక్కల సంరక్షణా బాధ్యతలనూ సమర్థంగా చేపట్టాలని ఆయా గ్రామ సర్పంచ్లకు సూచించారు.
త్వరితగతిన పూర్తి చేయాలి..
గ్రామస్థులు సేదతీరేందుకు ప్రకృతి వనాలు ఎంతగానో ఉపయోగపడతాయని హరిచందన పేర్కొన్నారు. అందుకే మొక్కలు నాటే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కాళిందిని, ఎంపీడీవో సందీప్, అటవీ శాఖ అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కరోనాను ఓడిద్దాం.. ప్రాణాలతో నిలుద్దాం: కిషన్రెడ్డి