నారాయణపేట జిల్లా ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించి రోగులను చికిత్స, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రివేళ చికిత్స నిమిత్తం వచ్చే రోగుల పట్ల అక్కడున్న సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదని వారు ఆరోపించారు. సిబ్బంది కొరతతో రోగులకు అసౌకర్యం కలుగుతోందని వైద్యులు కలెక్టర్కు తెలుపగా... అటువంటి సమస్యలేవైనా ఉంటే... తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
- ఇదీ చూడండి : పెట్రో సెగ: 6 రోజుల్లో ధర ఎంత పెరిగిందో తెలుసా?