ETV Bharat / state

'గన్నీ బ్యాగులన్నీ తిరిగి సర్కారుకు అందజేయాలి'

author img

By

Published : Sep 23, 2020, 8:49 PM IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయంలో చౌకధర దుకాణ డీలర్లతో కలెక్టర్​ సమావేశం నిర్వహించారు. దుకాణ డీలర్లందరూ గన్నీ బ్యాగులను తిరిగి ప్రభుత్వానికే ఇవ్వాలని కలెక్టర్​ హరిచందన తెలిపారు.

collector hari chandana meeting at narayanpet district
'గన్నీ బ్యాగులన్నీ తిరిగి సర్కారుకు అందజేయాలి'

నారాయణపేట జిల్లా కేంద్రంలో గన్నీ బ్యాగులను తిరిగి ప్రభుత్వానికే ఇవ్వాలని కలెక్టర్​ హరిచందన తెలిపారు. కలెక్టరేట్​ సమావేశం హాలులో చౌక ధర దుకాణ డీలర్లతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల 100 శాతం గన్నీ బ్యాగులను రెగ్యులర్​గా ఇవ్వాలని, డీలర్లు డాటా ఎంట్రీ, గ్రూప్​ ఇన్సూరెన్స్​ వివరాలను అందజేయడంలో తహసీల్దార్​లతో సహకరించి త్వరగా పని పూర్తయ్యేటట్లు చూడాలని కలెక్టర్​ ఆదేశించారు.

ప్రతి దుకాణంలో నేమ్​ బోర్డు, ధరల పట్టిక, నిల్వల సూచిక తప్పకుండా ఉండేటట్లు చూడాలని.. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ హెచ్చరించారు. ఈ పనులన్నీ ఈనెల 30 లోపు పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్​వో శివప్రసాద్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.