ETV Bharat / state

కృష్ణా నదిలోకి ఎవరూ వెళ్లొద్దు: కలెక్టర్

కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్​ హరిచందన పర్యటించారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉండడం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ సూచించారు.

Narayanapet Collector Visits Krishna Catchment area
కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్
author img

By

Published : Aug 17, 2020, 7:26 PM IST

నారాయణపేట జిల్లాలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆర్డీవో శ్రీనివాసులుతో కలిసి జిల్లా కలెక్టర్​ హరిచందన పర్యటించారు. వరుస వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉండడం వల్ల ప్రజలను అప్రమత్తం చేశారు.

కర్ణాటకలోని నారాయణపూర్​ జలాశయం నుంచి రెండు లక్షల 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల అవుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున నదీ పరివాహక ప్రాంతమంతా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని కలెక్టర్​ సూచించారు. గ్రామాల్లోని వీఆర్​ఏ, వీఆర్​వోలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లకూడదని, చేపలు పట్టేందుకు కూడా అనుమతి లేదని మత్స్యకారులకు సూచించారు.

ఇదీ చూడండి : 'మెడికల్ హబ్​గా హైదరాబాద్​ మహానగరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.