ETV Bharat / state

కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన - నారాయణ పేట జిల్లా తాజా వార్తలు

నారాయణ పేట జిల్లాలో కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు వాటి నీళ్లు పోశారు.

కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన

author img

By

Published : Jul 1, 2020, 5:38 PM IST

నారాయణ పేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పగిడిమర్రి రోడ్డులో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే సుమారు రూ. 70 లక్షల అంచనాతో నిర్మిస్తున్న సైన్స్ పార్క్, రూ. 45 లక్షల వ్యయంతో సాయి విజయ్ కాలనీలో నిర్మిస్తున్న చిల్డ్రన్స్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు.

అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఎమ్మెల్యేతో పాటు డీఆర్వో శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ గందె అనసూయ, ఎంపీపీ శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.