నారాయణపేట జిల్లా మక్తల్లో స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సిరెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. మక్తల్ మండలంలోని సంగంబండ రిజర్వార్లో 10 లక్షల చేప పిల్లలను వదిలారు.
మత్స్య సంపదతో నిరుపేదలకు ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను వేచ్చిస్తుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ కింద మత్స్యకారులకు వాహనాలు ఇతర సదుపాయాలను అందిస్తుందని... వాటిని సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ వనజ, మక్తల్ మార్కెట్ ఛైర్మన్ రాజేష్ గౌడ్, ఎంపీపీ వనజ తదితరులు పాల్గొన్నారు.