నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొవిడ్ కేర్ సెంటర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 బెడ్లతో పాటు.. 10 బెడ్లతో కూడిన కొవిడ్ కేర్ సెంటర్‌ను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలతో కొవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రోగులకు ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు అందజేస్తున్నామని తెలిపారు. ఎలాంటి లక్షణాలు కనిపించినా... ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఇవీ చూడండి: కొవిడ్ టీకాల సరఫరాకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం