నారాయణ పేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో 10 మంది మహిళలకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అందజేశారు. పేదింటి ఆడపిల్లల పెండ్లికి ఇంటి పెద్దగా మారి సీఎం కేసీఆర్ రూ. 1,01,116 అందజేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. లాక్‌డౌన్ పరిస్థితుల్లోనూ చెక్కులు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ వనజ ఆంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ నిజాంపాషా,ఎంపీపీ వనజ, తహసీల్దార్ నర్సింగ్ రావు, ఎస్సై అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేడు, రేపూ అక్కడక్కడా వర్షాలు