వీధి వ్యాపారులు అభివృద్ధి చెందాలని మక్తాల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మండల కేంద్రంలో సంత ప్రారంభం కావడంతో చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందని రామ్మోహన్ రెడ్డి అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఓ దుకాణంలో కూర్చొని కూరగాయలను విక్రయించి వ్యాపారస్థుల్లో నూతన ఉత్సాహం నింపారు. స్థానికులే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలూ మార్కెట్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఛైర్మన్ అశోక్ గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 26 నుంచి బాక్సింగ్ కప్ అండ్ ప్రో నైట్: శ్రీనివాస్ గౌడ్